చిన్న నాడు ఉండేది మా ఇంటి దగ్గర ఒక అందాల బాలిక....
ఆమె నాకు పలక పట్టిన దగ్గర నుంచి మంచి స్నేహిక
కలిసి ఆడుకున్నాము మేమిద్దరం చలాకీ గా
అందంలో ఆమెకి ఆమే సాటిక...
వచ్చింది చాల సార్లు ఆమెకి అలక
ఒక చిన్న జోకే ఆ అలక ని మాయం చేసి గుళిక
అప్పుడప్పుడు ఆమె కొంచెం కోపిక
అదే సమయంలో ఉంటుంది ఆమె అందానికే అందక....
ఎలా అయ్యానో తెలియదు ఆమెకి ఫ్యాన్ ఇక....
ఎందుకో తెలియదు ఆమె అప్పటినుంచి నా గుండెలని పరిపాలిస్తున్న రాణిక..
ఇంకా ఉండాలని ఉంది ఆమెతో గడిపిన రోజులు చాలాక
ఆమె నా జీవితంలో మర్చిపోలేని ఒక కలయిక...
ఇంకెవరు రాలేదు ఇంతవరకు ఆమెకి పోలిక ...
కాని దాచాను ఆమె దగ్గర ...ఆ మాట... ధైర్యం చాలక....
ఇప్పుడు ఆమెని మర్చిపోవడమే ఇంక ఆమెకి,నాకు మేలిక
ఎందుకంటే ఆమె ఎక్కబోతోంది పల్లకి ఇక
రాబోతున్నాడు ఆమె కి ఒక ఏలిక..
రేపో మాపో మోగుతుంది ఆమె పెళ్లి డోలిక
కానీ ఆమెని మర్చిపోవడం అంత తేలికా?
చెప్పండి మీరే ఈ కధ చదివాక...
అవును మరచితిని ఆమె పీరు మల్లిక......
ఇది చదువుతున్న వారి అందరికి ఒక గమనిక
ఏంటంటే ఏంటంటే.. ఇదంతా జస్ట్ ఒక కల్పిక....
మల్లి కలుద్దాం ఇప్పటికి సెలవిక... :)
hehe..shabhash!!! chimpesav :D
ReplyDelete